సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.2.50 లక్షల మద్యం సీజ్

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అక్రమంగా రవాణ చేస్తున్న మద్యం బాటిళ్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైల్లో రూ.2.50 లక్షల విలువైన 76 మద్యం సీసాలను పట్టుకున్నారు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఏపీ, చంఢీగఢ్ రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.