'దిత్వా' తుఫానుపై మంత్రి పార్థసారథి సమీక్ష

'దిత్వా' తుఫానుపై మంత్రి పార్థసారథి సమీక్ష

BPT: 'దిత్వా' తుఫాను హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపై మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం కలెక్టరేట్‌లో అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. తుఫాను వల్ల జరిగే నష్టాన్ని తగ్గించేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.