నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
SKLM: ఉద్యోగాల పేరుతో నకిలీ నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిన ప్రవీణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పాతపట్నం ఎస్సై మధుసూదనరావు గురువారం తెలిపారు. బొమ్మికకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి, నకిలీ నియామక పత్రాలు అందించి రూ.8 లక్షలు తీసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.