కారు ఆటో ఢీ.. ఆరుగురికి గాయాలు

కారు ఆటో ఢీ.. ఆరుగురికి గాయాలు

WGL: ఖిల్లా వరంగల్ మండలం మామూనూరు ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా శుక్రవారం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.