రైలులో ముగ్గురు బాల కార్మికులు గుర్తింపు

పల్నాడు: పిడుగురాళ్లలో రైల్వే పోలీసులు ముగ్గురు బాల కార్మికులను గుర్తించారు. హౌరా - సికింద్రాబాద్ రైలులో ప్రయాణిస్తున్న బీహార్‌కు చెందిన ముగ్గురు బాలలను శనివారం అదుపులోకి తీసుకున్నారు. పిడుగురాళ్ల రైల్వే ఎస్సై హుస్సేన్ మాట్లాడుతూ.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు వారిని రాజుపాలెం మండలం కొండమోడులోని చిల్డ్రన్ హోమ్‌కు అప్పగించారు.