అప్పుడు కపిల్ దేవ్.. ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్ ప్రీత్ సారథ్యంలోని టీమిండియా తొలిసారిగా మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. 1983లో పురుషుల జట్టు కపిల్ దేవ్ సారథ్యంలో తొలి ప్రపంచ కప్‌ను గెలిచినట్లే, ఇప్పుడు మహిళల జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయం మహిళల క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.