నేడు పీజీఆర్ఎస్‌కు కలెక్టర్ దూరం
ELR: ఏలూరు ప్రాంగణం గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ పాల్గొనరని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు ఆదివారం తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర బృందం వస్తున్న నేపథ్యంలో, ఆ బృందం వెంట కలెక్టర్, జేసీ ఉంటారని ఆయన వివరించారు.