​'దిశ'కు డుమ్మా.. అధికారులపై ఎంపీ సీరియస్

​'దిశ'కు డుమ్మా.. అధికారులపై ఎంపీ సీరియస్

ASR: పాడేరులో జరిగిన 'దిశ' సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడంపై కమిటీ ఛైర్మన్ డా. గుమ్మ తనూజ రాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన అభివృద్ధి సమీక్షకు రాని అధికారుల తీరుపై మండిపడ్డ ఆమె, వెంటనే వారికి షోకాజ్ నోటీసులు (Show-cause notices) జారీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.