'ఆ రికార్డుల్లో చోటు సంపాదించడం గర్వించదగ్గ విషయం'

కృష్ణా: కూచిపూడి నృత్యంలో 1156 ప్రదర్శనలు ఇచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన బాల సరస్వతిని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అభినందించారు. కూచిపూడి నృత్యంలో 12 సంవత్సరాలుగా శిక్షణ అభ్యసిస్తూ, అందులో ఇప్పటివరకు 1156 నృత్య ప్రదర్శనలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించడం గర్వించదగ్గ విషయమని ఆమె అన్నారు.