రొళ్ల పోలీస్ స్టేషన్‌కి కొత్త ఎస్ఐగా వీరేష్ నియామకం
సత్యసాయి: రొళ్ల పోలీస్ స్టేషన్‌కు అగళి ఎస్ఐగా పనిచేస్తున్న వీరేష్‌ను కొత్త ఎస్ఐగా నియమిస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రొళ్ల ఎస్సైగా ఉన్న వీరాంజనేయులు రోద్దం పోలీస్ స్టేషన్‌కు బదిలీ అవ్వగా, బుధ, గురువారాల్లో ఇద్దరూ తమ కొత్త స్టేషన్లలో విధుల్లో చేరనున్నట్లు పోలీసులు తెలిపారు.