మా సమస్యలు పరిష్కరించండి సారూ..!

GNTR: తెనాలిలోని 28, 29వ వార్డుల్లో గురువారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళలు తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన వినతిపత్రాలను పరిశీలించి, త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.