నేడు ఎస్జీటీ అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన

WGL: వరంగల్ జిల్లా ఎస్జీటీ 1:3 నిష్పత్తిలో భాగంగా గురువారం 271 నుంచి 435 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. నిన్న సర్టిఫికెట్ పరిశీలనకు రాని అభ్యర్థులు.. ఈ రోజు కూడా అటెండ్ అవ్వవచ్చన్నారు.