సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: కాంగ్రెస్ నాయకురాలు

వక్ఫ్ సవరణ చట్టంలో సుప్రీంకోర్టు ఆదేశంపై కాంగ్రెస్ నాయకురాలు ముంతాజ్ పటేల్ స్పందించారు. 'ఈరోజు సుప్రీం చేసిన పరిశీలనలను మేము స్వాగతిస్తున్నాము. ఒక ముస్లిం మహిళగా కాలంతో పాటు వ్యవస్థలు మారుతాయని, మారాలని నేను ఖచ్చితంగా చెబుతాను. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇది పరిణామం చెందాలి. కానీ సాంస్కృతిక, మతపరమైన నిర్మాణం యొక్క పవిత్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం' అని తెలిపారు.