జిల్లా రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

E.G: అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర పేరిట సెప్టెంబర్ 9న భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు ఏర్పాటు చేస్తున్నట్లు IRCTC అధికారులు తెలిపారు. పూరి, డియోఘర్, వారణాసి, అయోధ్య ప్రయాగ్రాజ్ క్షేత్రాలకు యాత్రికులను తీసుకెళ్లే ఈ రైలు.. ఆరోజు ఉదయం 11గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని రైల్వేస్టేషన్లలో ఆగుతుందన్నారు.