'వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

'వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

NTR: జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. నగరపాలక సంస్థతో పాటు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పిడుగులు, వడగండ్ల వానల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.