శాస్త్రోక్తంగా దేవుడి చిత్రపటాల నిమజ్జనం

శాస్త్రోక్తంగా దేవుడి చిత్రపటాల నిమజ్జనం

NDL: దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని 'మన ఊరు-మన గుడి-మన బాధ్యత' వ్యవస్థాపకులు శివకుమార్ రెడ్డి కోరారు. ఆదివారం నంద్యాల పద్మావతీనగర్ స్వచ్చభారత్ పార్క్ దేవుళ్ల చిత్రాలకు శాస్త్రోక్తంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లలో పూజలందుకొని ఛిద్రమై పూజకు ఉపయోగించని సుమారు 300 దేవుళ్ల చిత్ర పటాలకు అర్చకులు సురేంద్రాచార్యులు పూజలు చేశారు.