బాలీవుడ్‌లో అన్నీ ఫేక్ సినిమాలే: నవాజుద్దీన్
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ హిందీ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం వస్తున్నవన్నీ ఫేక్ చిత్రాలని, కథల్లో అస్సలు నిజాయితీ ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం ఒక రకమైన భావజాలాన్ని ప్రజలపై రుద్దడానికే సినిమాలు తీస్తున్నారని మండిపడ్డాడు. అబద్ధపు కథలతో ప్రేక్షకులను మభ్యపెట్టడం ఆపి వాస్తవాలకు దగ్గరగా ఉండే సినిమాలు తీయాలని దర్శకులకు సూచించాడు.