పాడి రైతులకు విశాఖ డెయిరీ ఆర్థిక భరోసా
AKP: పాడి రైతులకు కష్టకాలంలో అండగా ఉంటామని విశాఖ డెయిరీ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. విశాఖ డెయిరీకి పాలు సరఫరా చేస్తూ.. మరణించిన వమ్మలి గ్రామానికి చెందిన ఇద్దరు సభ్యుల నామినీలకు సుఖీభవ పథకంలో భాగంగా రూ.60,000 ఆర్థిక సాయం బుధవారం అందజేశారు. అలాగే కొన్నెంపూడి గ్రామంలో మరణించిన పాడి పశువుల యజమానులు ఇద్దరికి రూ.75,000 బీమా సొమ్ము అందజేశారు.