ఉప్పలపాడు గురుకులంలో అధికారుల విచారణ
PLD: నూజండ్ల(M) ఉప్పలపాడులోని డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మంగళవారం సాయంత్రం ఎంఈఓ, ఎంపీపీ విచారణ చేపట్టారు. విద్యార్థులకు వడ్డించే మజ్జిగను కుక్క తాగిందన్న ఆరోపణలు, ప్రిన్సిపాల్ అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులపై ఆరా తీశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రిన్సిపాల్ పాఠశాలలో ఉండటం లేదని, గుంటూరు వెళ్తున్నట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది.