మంచినీటి ట్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే
కోనసీమ: అమలాపురం రూరల్(మం) వన్నె చింతలపూడి గ్రామ ప్రజల తాగునీటి కష్టాలను తీరుస్తూ, నూతనంగా నిర్మించిన మంచినీటి ట్యాంకును మంగళవారం స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామ మహిళల కష్టాలను గుర్తించి, యుద్ధ ప్రాతిపాదికన ఈ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేయించిన ఎమ్మెల్యే చొరవను మహిళలు అభినందించారు.