వలసపాకలిలో రోడ్డు సమస్యలపై గ్రామస్తుల ఆందోళన

వలసపాకలిలో రోడ్డు సమస్యలపై గ్రామస్తుల ఆందోళన

KKD: తోండంగి మండలం వలసపాకలి గ్రామంలో రోడ్డు పరిస్థితులు అధ్వాన్నంగా మారడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన రోడ్డుపై ఏర్పడిన గుంతలు, పూడులు, జారుడు ప్రాంతాల వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల చిన్న ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామస్తులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.