రెడ్ క్రాస్ కమిటీ ఎన్నికల్లో భగ్గుమన్న విభేదాలు
కోనసీమ: అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న గోదావరి భవన్‌లో శుక్రవారం రెడ్ క్రాస్ నూతన కమిటీ ఎన్నికల నిర్వహించారు. ఎన్నికలలో సభ్యుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కమిటీ నియామకాన్ని రెడ్ క్రాస్ సభ్యులు అడ్డుకుని నిరసన తెలియజేశారు. ఎన్నికలలో కొంతమంది అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సభ్యులు నిలదీశారు. కమిటీ చైర్మన్ సభ్యులను శాంతింపజేశారు.