యువకుడిపై పోక్సో కేసు నమోదు

యువకుడిపై  పోక్సో కేసు నమోదు

ప్రకాశం: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్సై సైదుబాబు తెలిపారు. మార్కాపురం పట్టణానికి చెందిన బాలికను మద్దిపాడుకు చెందిన ఓ యువకుడు రెండు రోజుల కిందట తీసుకువెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఇవాళ తెలిపారు.