చిన్నమండెం ప్రజా దర్బార్‌లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వగృహంలో మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజలు పాల్గొన్నారు.