ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే
MHBD: తొర్రురు మండలంలోని ఖానాపురం, గోపాలగిరి గ్రామాల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇవాళ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున ఇంటింటి ప్రచారం చేసిన ఆమె ప్రజలను ఆపాయంగా పలకరించారు. గ్రామాభివృద్ధి, మౌలిక వసతులు, రైతు సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.