త్వరలో బీటీ పత్తి విత్తనాల ధరల ప్రకటన!
పత్తి రైతులకు కీలకమైన బీటీ పత్తి విత్తనాల గరిష్ఠ విక్రయ ధరను కేంద్ర వ్యవసాయశాఖ త్వరలో ఖరారు చేయనుంది. 2026-27 సీజన్‌కు సంబంధించి బోల్‌గార్డ్-1, బోల్‌గార్డ్-2 ధరలపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోంది. అయితే, ప్రభుత్వం పత్తి విత్తనాలపై ప్రకటించేది గరిష్ఠ ధర మాత్రమే. కంపెనీలు, డీలర్లు అంతకంటే తక్కువ ధరకే విక్రయించవచ్చు. ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేదు.