ఉస్మానియాలో మంచి నీటి కొరత..!
HYD: తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ లైబ్రరీలో మంచినీటి సమస్య ఏర్పడుతుందని విద్యార్థులు వాపోయారు. మంచినీరు రావడం లేదని, RO ప్లాంట్ ట్యాప్స్ కొన్ని పనిచేయడం లేదని తెలిపారు. అధికారిక యంత్రాంగం స్పందించి సమస్య మరోసారి పునరావృతం కాకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు.