VIDEO: ​'రెండేళ్లుగా తిరుగుతున్నా.. న్యాయం జరగలేదు'

VIDEO:  ​'రెండేళ్లుగా తిరుగుతున్నా.. న్యాయం జరగలేదు'

అన్నమయ్య: మదనపల్లె కలెక్టరేట్ వద్ద సోమవారం గోళ్లపల్లికి చెందిన రాజమ్మ తన దివ్యాంగుడైన కుమారుడు మనోహర్ (35)తో కలిసి నిరసన తెలిపారు. మనోహర్‌కు ప్రస్తుతం నెలకు రూ. 6 వేల పింఛన్ వస్తోంది. అతని వైకల్య తీవ్రత దృష్ట్యా రూ. 15 వేల పింఛన్‌కు అర్హుడైనప్పటికీ, అధికారులు పట్టించుకోవడం లేదని రాజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా తిరుగుతున్నా న్యాయం జరగలేదన్నారు.