మృతునికి నివాళి అర్పించిన మాజీ మంత్రి

మృతునికి నివాళి అర్పించిన మాజీ మంత్రి

MHBD: తొర్రూర్ మండలం వెలికట్టే గ్రామానికి చెందిన కోమాండ్ల వెంకట్ రావు అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి ఆయన భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వెంకట్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.