VIDEO: రేవంత్ రెడ్డికి కూల్చుడు తప్ప.. కట్టుడు రాదు: హరీష్ రావు
MDK: రాష్ట్రాన్ని పాలించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కొల్లూరులో ఆయన మాట్లాడుతూ.. మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదన్నారు. పదేళ్ల కేసీఆర్ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే, రేవంత్ రెడ్డి దానిని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి కూల్చడమే తెలుసు కానీ, కట్టడం రాదని ఎద్దేవ చేశారు.