పాఠశాలల బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు

GNTR: గుంటూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం రవాణా శాఖ అధికారులు విద్యాసంస్థలకు చెందిన స్కూల్, కాలేజీ బస్సులను ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో ఇన్సూరెన్స్, ఫిట్‌నేస్ పరిమితికి మించి విద్యార్థులు ఉండటం, డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్ తదితర ఉల్లంఘనలకు పాల్పడిన 53 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు.