రాజకీయ పార్టీలతో డీఆర్వో సమీక్షా సమావేశం
అనంతపురం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్వో ఏ.మాలోల గురువారం నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా అందిన క్లెయిమ్స్ పరిష్కారం, ఓటర్ మ్యాపింగ్ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.