కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
ADB: బోథ్ మండలంలోని నిగిని గ్రామంలోని జగదాంబ దేవి సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయం వద్ద బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంజూరు చేయించిన రూ. 5 లక్షలతో నిర్మాణం జరుగుతున్న కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.