4,200 లీటర్ల బెల్లం పులుసు ధ్వంసం

4,200 లీటర్ల బెల్లం పులుసు ధ్వంసం

WG: నాటుసారా తయారీకి ఉపయోగించే 4,200 లీటర్ల బెల్లం పులుసును ధ్వంసం చేసినట్లు తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ మంగళవారం తెలిపారు. మండలంలోని తాడిపూడి జలాశయం సమీపంలో నాటుసారా తయారీ జరుగుతుందని ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేశామన్నారు. సారా తయారీకి భూమిలో పాతిన 21 భారీ డ్రమ్ములను స్వాధీనం చేసుకుని బెల్లం పులుసు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.