ప్రతి నెలా 38687 మందికి పింఛన్లు పంపిణీ: ఎమ్మెల్యే
NLR: సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి నెలా 38687మందికి రూ. 16.73 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలియజేశారు. సోమవారం ముత్తుకూరు మండలంలోని తాళ్లపూడి పంచాయతీ కప్పలదొరువు, మల్లూరులో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. జోరు వానలోను సైతం ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ పింఛన్లను అందజేశారు.