తెనాలి డివిజన్‌లో వర్షపాతం వివరాలు

GNTR: తెనాలి డివిజన్ వ్యాప్తంగా ఆదివారం ఉదయం వరకు మొత్తం 377.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. డివిజన్ సగటు వర్షపాతం 47.1 మి.మీగా ఉంది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు. కొల్లిపర 125.6 మి.మీ, దుగ్గిరాల 98.8 మి.మీ, తెనాలి 42.4 మి.మీ, చేబ్రోలు 30.0 మి.మీ, మంగళగిరి 17.2 మి.మీ, పొన్నూరు 11.6 మి.మీ, కాకుమాను 8.2 మి.మీ నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.