VIDEO: విద్యుత్ షార్ట్ సర్క్యూట్.. పూరిల్లు దగ్ధం

VIDEO: విద్యుత్ షార్ట్ సర్క్యూట్.. పూరిల్లు దగ్ధం

NLR: మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డులోని సంగమేశ్వర గిరిజన కాలనీలో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. యాకసిరి రత్నం అనే గిరిజనుడి ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయింది. ఉన్నట్లుండి ఇంట్లో నుంచి పొగలు వచ్చాయి. తర్వాత మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లోని నిత్యావసర సరుకులు, రూ.30 వేల నగదు పూర్తిగా కాలిపోయాయి.