'లోక్ అదాలత్‌ను ప్రజలు వినియోగించుకోవాలి'
MNCL: లక్షెట్టిపేట సివిల్ కోర్టు ఆవరణలో నిర్వహించే లోక్ అదాలత్‌ను ప్రజలు వినియోగించుకోవాలని జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. ఇవాళ జన్నారంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ లీగల్ సర్వీసెస్ రాష్ట్ర, జిల్లా అథారిటీల ఆదేశాల మేరకు 15న కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ ఉంటుందన్నారు. ఈ నెల 15 లోపు కేసులు ఉండి రాజీ కుదుర్చుకుంటే లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారం అవుతాయన్నారు.