'జర్నలిస్టుల సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి'

'జర్నలిస్టుల సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి'

VSP: జర్నలిస్టుల సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాలను కోరనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం (ఎన్‌ఏజే) కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి. నారాయణ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, పెన్షన్ సదుపాయాల కోసం ప్రతిపాదనలు చేయనున్నట్లు చెప్పారు.