ఖాజీపేటలో ముగ్గురు జూదరులు అరెస్ట్
KDP: ఖాజీపేట(M) పాటిమీద పల్లె సమీపంలోని అంకాలమ్మ దేవాలయానికి వెళ్లే దారిలో ఓ రేకుల షెడ్డు వద్ద జూదం ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ వంశీధర్ తెలిపారు. వారి నుంచి రూ. 2600 నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు 52 పేక ముక్కలను సీజ్ చేశామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.