రక్షాబంధన్ పండుగ సోదర భావానికి ప్రతీక: జిల్లా ఎస్పీ

రక్షాబంధన్ పండుగ సోదర భావానికి ప్రతీక: జిల్లా ఎస్పీ

వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌కి సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలో తమ అన్నదమ్ములకు అనురాగంతో చేతికి రక్షబంధనాన్ని కట్టడం గొప్ప విషయం అన్నారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షాబంధన్ పండుగ సోదర భావానికి ప్రతిక అని అన్నారు.