'బాధ్యతతో విధులు నిర్వహించాలి'

'బాధ్యతతో విధులు నిర్వహించాలి'

SRD: కంగ్టిలో 108, 102 అత్యవసర వాహనాలను ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ హుస్సేన్, జిల్లా మేనేజర్ సంపత్ బుధవారం తనిఖీ చేశారు. వాహనాల్లోని వైద్య పరికరాల పనితీరును, సిబ్బంది రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవలందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, విధుల్లో బాధ్యతగా ఉండాలని ఈ సందర్భంగా వారు సిబ్బందిని ఆదేశించారు.