గంగారంలో మూడో విడత పంచాయతీ ప్రచారం ప్రారంభం.!
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత ప్రచారం మొదలైంది. మండలంలోని 12 గ్రామ పంచాయతీలు, 100 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 9,174 ఓటర్లు (పురుషులు 4,543, మహిళలు 4,631) ఉన్నారు. వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. మూడో దశ ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి.