నెతన్యాహుకు పుతిన్ ఫోన్!

నెతన్యాహుకు పుతిన్ ఫోన్!

ప్రపంచ జియో పాలిటిక్స్‌లో అరుదైన ఘటన జరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సంభాషణ జరిగింది. ప్రస్తుత గాజా పరిణామాలు, కాల్పుల విరమణ ఒప్పందం, ఇజ్రాయెల్ బందీలు, పాలస్తీనా ఖైదీల మార్పిడి గురించి ఈ ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం, సిరియా అంశం కూడా చర్చించినట్లు నెతన్యాహు కార్యాలయం తెలిపింది.