VIDEO: వరంగల్ 40వ డివిజన్‌లో పిచ్చికుక్క దాడి
వరంగల్ నగరంలోని 40వ డివిజన్ ఉర్సు ప్రాంతంలో సోమవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ చిన్నారిపై, వృద్ధురాలిపై కుక్క అకస్మాత్తుగా దాడి చేసి కరిచింది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు వెంటనే జిల్లా ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.