ప్రయాణికులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్

ప్రయాణికులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్

VKB: రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని షాద్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో పాటు రాఖీ పౌర్ణమి కావడంతో సొంతూళ్ల బాటపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రస్తుతం 90 బస్సులు కొనసాగుతుండగా.. అదనంగా మరో 30 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయినా కూడా ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.