'సైనికుల త్యాగాలను రాజకీయాలకు ఉపయోగించడం సిగ్గుచేటు'
BHPL: జూబ్లీహిల్స్ ప్రచారంలో CM రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ చిట్యాల మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. వెంకటేష్ మాట్లాడుతూ.. సైనికుల త్యాగాలను రాజకీయాలకు ఉపయోగించడం సిగ్గుచేటని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.