'నీటి స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరిశీలించాలి'

'నీటి స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరిశీలించాలి'

జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని తాళ్లచెరువు ఫిల్టర్ బెడ్‌ను అదనపు కలెక్టర్ బీ. రాజ గౌడ్ శనివారం పరిశీలించారు. పట్టణ ప్రజలకు సకాలంలో నీరు అందించాలని, ఫిల్టర్ బెడ్‌ను, నీటి స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్, సంబంధిత అధికారులు అదనపు కలెక్టర్‌తో ఉన్నారు.