12 గ్రామాల్లో భూ రీ సర్వే పూర్తి: ఆర్డీవో

AKP: నర్సీపట్నం డివిజన్‌లో 12 గ్రామాల్లో భూరి సర్వే పూర్తయిందని నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ తెలిపారు. శనివారం ఆయన మాకవరపాలెం మండలం లచ్చన్న పాలెం గ్రామంలో భూ రీ సర్వే రికార్డులను పరిశీలించారు. అనంతరం రైతులకు నైన్ టు నోటీసులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామారావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.