ఈనెల 27న కళ్యాణ మహోత్సవం

ఈనెల 27న కళ్యాణ మహోత్సవం

SKLM: ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఈనెల 27న కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం శ్రీదుర్గాభవాని భజన మండలి వారిచే భజన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, 28న అన్నమయ్య కీర్తనల కచేరి, 29వ తేదీ సాయంత్రం తిరువీధి మహోత్సవం ఉంటుందన్నారు.